calender_icon.png 15 January, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

08-07-2024 05:34:54 PM

బెల్లంపల్లి: నాయకులకు కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఎంపీపీలు, జడ్పీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మద్ధతు కోల్పోయిందని తెలిపారు.

కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కాంగ్రెస్ కు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు