calender_icon.png 8 January, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు..

07-01-2025 05:07:56 PM

కేటీఆర్ విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకో

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు...

పెద్దపల్లి (విజయక్రాంతి): రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, ఆందోళనలు చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(MLA Vijayaramana Rao) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక RK గార్డెన్స్ లో మంగళవారం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కూడా లేకుండా పోతుందనే భయంతో బీఆర్ఎస్ లీడర్లు రోడ్లపైకి వచ్చి రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు ఎందుకు చేయలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.239 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పారు.

సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ కొందరికి త్వరలోనే మాఫీ చేయడం జరుగుతుందని వివరించారు. సన్న వడ్లకు రూ.59.20 కోట్ల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తామని తెలిపారు. రైతులకు ఇలా అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే సంక్షేమ పథకాలు చేపడుతుంటే 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ రైతులకు ఏం చేసిందని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ చేస్తున్న ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఈ -రేస్ ఫార్ములా కేసులో కేటీఆర్ ప్రజలకు చెప్పేదొకటి చేతల్లో చేసేది మరొకటిగా ఉందన్నారు. ఒకవైపు విచారణకు హాజరవుతా అవసరమైతే జైలుకు వెళ్తా అని ప్రగల్బాలు పలికిన కేటీఆర్ తిరిగి అరెస్టు భయంతో గౌరవ హైకోర్టులో క్వాట్ పిటీషన్ వేశారన్నారు. హైకోర్టు తాజాగా ఆయన పిటిషన్ కొట్టి వేసిందన్నారు.

ఈ కేసులో తన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఏసీబీ విచారణకు హాజరుకావాలని విజయరమణ రావు సూచించారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, చట్టం తన పని తను చేసుకోపోతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లు ఈర్ల స్వరూప, మినూపల ప్రకాష్ రావు, పట్టణ కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భుతగడ్డ సంపత్, బండారి రామ్మూర్తి, సందనవేమీ రాజేందర్, తూముల సుభాష్, ఆశ్రాఫ్, సయ్యధ మస్రథ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కుమార్, గాజుల రాజమల్లు, సామ రాజేశ్వర్ రెడ్డి, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, శ్రీగిరి శ్రీనివాస్, అల్ల సుమన్ రెడ్డి, దుగ్యాల సంతోషం రావు, సర్వర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ డైరెక్టర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.