calender_icon.png 17 April, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ రజితోత్సవ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

15-04-2025 03:04:58 PM

వైరా మాజీ ఎమ్మెల్యే లు బానోత్ మదర్ లాల్, కొండబాల కోటేశ్వరరావు

వైరా,(విజయక్రాంతి): ఈనెల 27 వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ బహిరంగసభ(BRS Party Silver Jubilee Public Meeting)కు సంబంధించిన పోస్టర్ను మంగళవారం బిఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులు కార్యకర్తలు ఆవిష్కరించారు. బహిరంగ సభకు సంబంధించి సన్నహాక సమావేశం వైరాలోని శ్రీనికేతన్ స్కూల్లో  నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ లు హాజరై సభకు సంబంధించిన పోస్టును ఆవిష్కరించారు. బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.