29-03-2025 01:45:29 AM
హనుమకొండ, మార్చి 28 (విజయక్రాంతి): మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసింది టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పార్టీ ఒకే ఒక్కడిగా మొదలైన కేసీఆర్ తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు. త్యాగాలు పోరాటాల ద్వారా తెలంగాణను సాధించిన నేత కేసీఆర్ 25 ఏండ్ల పాటు ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ పని చేసింది. 14 ఏండ్ల పాటు తెలంగాణ కోసం కొట్లాడం,10 ఏండ్ల పాటు కేసీఆర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణను దేశంలోనే ప్రధమంగా నిలిపారు.దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిన నాయకుడు కేసీఆర్. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల అభిష్టం మేరకు పని చేశారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో 1200 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఓడితల సతీష్ బాబు, చల్ల ధర్మారెడ్డి, నన్నప్పనేని నరేందర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.