calender_icon.png 28 April, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పల్లెనా గులాబీ జెండాలు రెపరెపలు

27-04-2025 12:10:46 PM

పెన్ పహాడ్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం లోని బిఆర్ఎస్ శ్రేణులు  పల్లె పల్లెనా ఆదివారం బీఆర్ఎస్ జెండాలను ఆపార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎగురవేశారు. ఈ సందర్భంగా అనంతారం గ్రామం లో అధ్యక్షులు కట్ల నాగార్జున మాట్లాడుతూ.. కేసీర్ నేత్రుత్వంలో తెలంగాణ రాకతో అన్ని రంగాలలో అభివృద్ధి జరగగా.. నేడు కాంగ్రెస్ రాకతో తెలంగాణ అంధకారం లో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆతర్వాత వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Party Silver Jubilee Celebrations) సభకు ఆయా గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, మస్తాన్, తుమ్మకొమ్మ విజయ్, పొదిల నాగార్జున, దండంపల్లి సత్యనారాయణ, షఫీ, పరంధాములు, సతీష్, గండికోట జానీ, నారాయణ రెడ్డి, దంతాల చెన్నకృష్ణ, మచ్చ జగదీశ్ తదితరులు ఉన్నారు.