calender_icon.png 13 April, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

12-04-2025 11:11:40 PM

తరిగొప్పుల (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, మండల పార్టీ అధ్యక్షులు పింగిలి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తరిగొప్పులలో ఈ రోజు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కంకణ బద్దులై సభకు అన్ని గ్రామాల నుండి భారీగా జనాలను తరలించి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి చిలువేరు లింగం, సుదర్శన్ గౌడ్, సంజీవులు, రాజారామ్, సత్తయ్య, రామరాజు, సాయిల రాజు, రాజేశ్వర్గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.