20-04-2025 05:57:59 PM
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో వందశాతం మళ్లీ బీఆర్ఎస్ పార్టీ(BRS Party)యే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(BRS Party District President Balka Suman) అన్నారు. ఆదివారం క్యాతన్ పల్లి తన నివాసంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న వరంగల్ ఎల్కాతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సంబంధించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టంగా నిర్మించాలని, శాశ్వత విజయం కోసం ప్రతిఒక్క కార్యకర్త కృషి చేయాలని సుమన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజరమేష్, పట్టణ అధ్యక్షుడు సుదర్శన గౌడ్ తదితరులు పాల్గొన్నారు.