calender_icon.png 24 November, 2024 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బఫర్ జోన్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయం!

09-10-2024 12:12:26 AM

గౌరెడ్డిపేట శివారులో పెద్దపల్లి జిల్లా ఆఫీసు

అధికారుల సర్వేలో నిర్ధారణ

పెద్దపల్లి, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ప్ర భుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కోయ శ్రీహ ర్ష సూచనలతో గత పదిహేను రోజులుగా సాగునీటి, రెవెన్యూ అధికారులు పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం మున్సిపాలిటీల పరిధిలో చెరువులు, కుం టల విస్తీర్ణంపై సర్వేలు చేపట్టారు.

ఈ సర్వే లో బీఆర్‌ఎస్ కార్యాలయం బఫర్ జోన్‌లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. పెద్దపల్లి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం పెద్దపల్లి మం డలంలోని గౌరెడ్డిపేట గ్రామ పంచాయతీలోని మంథని ప్రధాన రహదారి పక్కనే నిర్మించినట్లు తెలుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో బఫర్ జోన్‌లో ఉన్న సర్వే నంబర్303 లోని ఎకరా 33 గుంటల భూమిని ఆక్రమించి బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం నిర్మించినట్లు సర్వేలో తేలింది.

ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దీంతో హైడ్రా తరహా చర్యలు జిల్లాలో చేపడితే పెద్దపల్లి బీఆర్‌ఎస్ కార్యాలయ భవనం నేలమట్టం చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ఎన్టీపీసీలో ఎఫ్‌టీఎల్‌లోనే దాదాపు 30 ఇండ్లు నిర్మించారని గుర్తించారు. అందులో కలెక్టర్ ఆదేశాలతో తొలుత 17 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రామగుండం, మంథని ప్రాంతాల్లోని పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.