హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమై కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ సమయపాలన పాటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. ప్రతి రోజూ ఆలస్యంగా సభ ప్రారంభమవుతోందని ఆరోపించారు. అందరికీ ఆదర్శంగా మనం ఉండాలని హరీశ్ రావు సూచించారు. సభ ఇలా ఆలస్యంగా జరిగితే ఎలా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో రైతు భరోసా విధివిధానాలపై స్వల్ప కాలిక చర్చ జరుగుతోంది.