calender_icon.png 15 March, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

15-03-2025 11:17:43 AM

హైదరాబాద్: శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(BRS MLCs) నిరసన చేపట్టారు. క్వింటాల్ పసుపుకు రూ. 15,000 మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. కేంద్రం పసుపు బోర్డు(National Turmeric Board ) ప్రకటించింది కానీ చట్టబద్ధత లేదని మధుసూదనాచారి పేర్కొన్నారు. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పసుపునకు రూ. 9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని మధుసూదనాచారి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందన్నారు.