calender_icon.png 13 March, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి నోటీసులు

13-03-2025 10:11:17 AM

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(BRS MLC Pochampally Srinivas Reddy)కి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. గత నెల 13న కూడా నోటీసులు ఇచ్చిన పోలీసులు రేపు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇటీవల పోచంపల్లి ఫామ్‌హౌస్‌లో కోడిపందాల నిర్వహణ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. మొయినాబాద్(Moinabad) లొని తన ఫామ్ హౌస్లో కోళ్ల పందాల, క్యాసినో నిర్వహణ కేసులో ఇప్పటికే ఆయనకు ఓసారి నోటీసులు అందాయి. దీంతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరఫున  లాయర్ ఆ నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గురువారం  ఉదయం మాదాపూర్ లోని అపర్ణ ఆర్కేడ్లోని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకొని ఈనెల 14న వ్యక్తిగతంగా మొయినాబాద్ పోలీసు స్టేషన్లో హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.