calender_icon.png 14 October, 2024 | 12:26 AM

మండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనచారి

13-10-2024 10:25:06 PM

అభినందించిన మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్ ప్రసాద్ 

హైదరాబాద్,(విజయక్రాంతి): శాసనమండలి ప్రతిపక్ష నేతగా  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,  మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు మధుసూదనాచారికి శుభాంక్షలు తెలిపారు. కాగా ప్రభుత్వం తరపున శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధుసూదనచారి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తానని, ఈ అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడి ప్రభుత్వం దృష్టితీసుకొచ్చిన అమలు చేసేలా తన వంతు పోరాటం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు,  తదితరులు పాల్గొన్నారు.