21-04-2025 12:25:05 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) సోమవారం నాడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం వద్ద వేద పండితులు దేవస్థానం అధికారులు సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో సీతారామచంద్రస్వామి వారి మూలవర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయగా, అమ్మవారి ఆలయం ఆవరణలో వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కవిత వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుసూదనరావు, భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు రేగా కాంతారావు తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.