13-04-2025 02:11:58 PM
కేసీఆర్ పై కోపంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సరికాదు
హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా హైదరాబాద్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరుఫున నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)పై కోపంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సరికాదని కవిత సూచించారు. అంబేద్కర్ స్పూర్తిని కేసీఆర్ భవిష్యత్తు తరాలకు తెలిపే ప్రయత్నం చేశారని ఆమె కొనియాడారు. సీఎం.. మంత్రులతో వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించాలని కవిత( BRS MLC Kalvakuntla Kavitha) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రజలు సందర్శించే అవకాశం కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.