calender_icon.png 13 December, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లిపై రేవంత్ సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణం

13-12-2024 12:16:30 PM

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యతరం వ్యక్తం చేశారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెజిట్ ఇవ్వడం దారుణమని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించామన్న కవిత బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీవో కూడా జారీ చేశామని గుర్తుచేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా తెలంగాణ తల్లిని నిలుపుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని కవిత ఆరోపించారు.