18-02-2025 03:56:11 PM
హైదరాబాద్: సూర్యాపేట పెద్దగట్టు జాతర(Peddagattu jathara)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) పాల్గొన్నారు. తింగమంతులస్వామి-చౌడమ్మ తల్లికి కవిత బోనం సమర్పించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, లింగయ్య యాదవ్, బొల్లం మల్లయ్య స్వామిని దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా(Suryapet District)లో లింగమంతుల జాతర మూడో రోజు కొనసాగుతోంది. లింగమంతుల జాతరలో భాగంగా చంద్రపట్నం కార్యక్రమం నిర్వహించారు. చంద్రపట్నం ఘట్టంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. లింగమంతుల స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులతో గొల్లగట్టు ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.