హైదరాబాద్: నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. దానం నాగేందర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బయట తిరగనియ్యనంటూ పరుష పదజాలం ఉపయోగించి బెదిరించాడు.
దానం నగేందర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. పోడియం వైపు దూసుకొచ్చిన దానం నాగేందర్ ను కాంగ్రెస్ సభ్యులు వెంటనే వెనక్కు లాగారు. దీంతో శాసనసభలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసనగా సభ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో స్పీకర్ శాసనమండలిని నిరవధిక వాయిదా వేశారు.