calender_icon.png 15 March, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో సీఎం ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్

15-03-2025 12:28:42 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభ నుంచి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) పార్టీ వాకౌట్ చేసింది. కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ని మార్చురీకి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ నేతలు బాయ్ కాట్ చేశారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం ప్రసంగాన్ని వినబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.