హైదరాబాద్: హైదరాబాద్ కు మూసీ ఒక వరం అని, భారత్ లో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్ హైదరాబాద్ లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ శనివారం నాగోల్ లోని ఎస్టీపీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... గత పాలకుల పాపం వల్ల మూసీ మురికిగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీనే అన్నారు. ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేది 2000 ఎంఎల్ డీల మురికి నీళ్లు.. హైదరాబాద్ లో రూ.3,866 కోట్లతో ఎస్టీపీలను నిర్మాంచామన్నారు. నీళ్లను శుద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి చేసేది శూన్యం అన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన పనులను ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సింది.. ప్రారంభించాల్సిన పని మాత్రమేనన్నారు.