calender_icon.png 3 April, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి

29-03-2025 12:16:24 AM

వారి తీరుపై ట్యాంక్‌బండ్‌పై ట్రాన్స్‌జెండర్ల నిరసన

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28(విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ట్రాన్స్‌జెండర్లకు క్షమాపణ చెప్పాలని ఇటీవల ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా నియామకమైన ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై గల శ్రీశ్రీ విగ్రహం ఎదుట వారు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రె స్ ప్రభుత్వం 50మంది ట్రాన్స్‌జెండర్లను పైలెట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించారని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతున్నపుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్; ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్‌లు అవహేళనగా మాట్లాడారని ఆరోపించారు.

తమను మనుషులుగా గుర్తించి, తమపై గౌరవంతో సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఈ డ్యూటీలు ఇచ్చారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తమను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు తాము గౌరవప్రదమైన పని చేసుకుంటుంటే అవహేళన పరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.