calender_icon.png 1 March, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన

09-12-2024 10:43:40 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మధ్య రహస్య స్నేహం ఉందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అదానీ, రేవంత్ రెడ్డి ఫొటోతో టీ షర్లులు ధరించి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వెళ్లారు. అదానీ, రేవంత్ ఫొటోతో టీషర్లులుతొలగించి వెళ్లాలని పోలీసులు సూచించారు. శాసనసభలోకి అనుమతించకపోవడంతో నేతలు నిరసనకు దిగారు. అధికారుల వైఖరికి నిరసనగా శాసనసభ వద్ద ఇదేమి రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం.. పోలీసు రాజ్యం అని నినాదాలు చేస్తున్నారు.

ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ.. సిగ్గుసిగ్గు.. హాయ్ హాయ్.. హాయ్ హయ్.. అదానీ, రేవంత్ భాయ్ భాయ్ అని నినాదాలు చేశారు. అక్రమ సంబంధాలను నిరసిస్తూ అదానీ టీషర్లులు ధరించి కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ కు వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ టీషర్లులు ధరించి వెళ్తే మీకు పర్యాలేదు.. రాష్ట్రంలో మాత్రం మేము టీషర్టులు ధరించి వస్తే మీకు  ఇబ్బందేంటి ఏంటి..? రాహుల్ గాంధీకి ఒక నీతి.. రేవంత్ రెడ్డికి మరో నీతి ఉంటుందా..?, అదానీ, రేవంత్ అక్రమ సంబంధాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా..? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.