calender_icon.png 30 April, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందాల పోటీలేనా.. సమస్యలు పట్టవా?

29-04-2025 11:54:05 PM

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఫైర్..

హైదరాబాద్ (విజయక్రాంతి): అందాల పోటీలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షలు తప్ప రైతులు, నిరుద్యోగుల సమస్యలపై సమీక్షలు చేయడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(BRS MLA Vivekananda) విమర్శించారు. సీఎం అసమర్థ పాలనతో హైదరాబాద్‌కు ఉన్న ఇమేజ్ కూడా దెబ్బతిన్నదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో వివేకానంద మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చి ఇచ్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లను కొనసాగించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చివరి ఆరునెలల్లో తన పాలనపై చర్చ జరుగుతుందంటున్న సీఎం రేవంత్.. అప్పటి దాకా హామీలు అమలు చేయరా అని ప్రశ్నించారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగం తర్వాత మంత్రుల మైండ్‌బ్లాక్ అయిందని వివేకానంద ఎద్దేవా చేశారు.