15-03-2025 12:15:22 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగంపై(Governor Jishnu Dev Varma Speech) చర్చ జరుగుతోంది. సభ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు నడుస్తోంది. గత ప్రభుత్వంపై సభలో భట్టి విక్కమార్క కావాలనే తప్పు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) ద్వజమెత్తారు.
గవర్నర్ ప్రసంగంపై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఎందుకు స్పందించారో తెలియదు?, డిప్యూటీ సీఎం పేరు కొట్టేయడానికే వివరణ ఇచ్చారా? అని ప్రశాంత్ రెడ్డి చమత్కరించారు. బాల్కొండ నియోజకవర్గంలో పూర్తిగా రుణమాఫీ జరగలేదని ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఎంతమందికి రుణమాఫీ చేశారో తెలిపారు.. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది.. ఇంకా తమపై ఏడుపు ఎందుకని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంత మందికి సన్నబియ్యానికి బోనస్ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 4 వేల పింఛన్ అన్నారు.. ఇచ్చారా? అని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.