హైదరాబాద్: ధరణి బాకాలేకపోతే.. దాన్నే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో భూమి హక్కులు, సంస్కరణలపై శుక్రవారం చర్చ జరుగుతోంది. కొత్త సీఎం కేవలం ధరణి పేరు మాత్రమే మారుస్తున్నారని ఆరోపించారు. కేవలం 7,8 లక్షల ఎకరాలపై మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. సింగపూర్ సంస్థ చేతిలో ధరణి పోర్టల్ పెట్టామని విమర్శిస్తున్నారని వెల్లడించారు. పీవీ నరసింహారావు కాలం నుంచి అనేక రెవెన్యూ సంస్కరణలు వచ్చాయని తెలిపారు. అనేక రాష్ట్రాలు భూ సర్వే చట్టాలు చేశాయి.. ఆనాటి సీఎం కేసీఆర్ అందరితో చర్చించే ధరణి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
కేసీఆర్ నాలుగు గోడల మధ్య ధరణిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ధరణి పేరు బాగాలేదని భూమాత అని పెడతామంటున్నారు. ధరణిఅంటే భూమాతనే.. ధరణి అనగానే వారికి కేసీఆర్ గుర్తొస్తున్నారన్నారు. దేశంలో కేసీఆర్ లా ఏ సీఎం కూడా ధరణి వంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయని పల్లా వెల్లడించారు. సీలింగ్ చట్టం ప్రకారం 25 నుంచి 52 ఎకరాల వరకే ఉండాలని తెలిపారు. ధరణి చట్టం వల్ల ప్రజలుకుఅనేక ప్రయోజనాలు కలిగాయన్నారు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా భూహక్కులు కల్పించామని పల్లా చెప్పారు.ధరణి ద్వారా తెచ్చిన భూసంస్కరణలు రైతులకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.