హైదరాబాద్: నల్గొండలోని ప్రభుత్వ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Former BRS MLA Kancharla Bhupal Reddy)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు పోలీసుల సమక్షంలోనే దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు(BRS Working President KT Rama Rao) తీవ్రంగా ఖండించారు. పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దాడి చేసిన వారు తప్పించుకోగా, పోలీసులు భూపాల్ రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్(nampally police station)కు తరలించారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అరాచకానికి ఈ ఘటన నిదర్శనమని, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(BRS) పార్టీకి భయపడి నల్గొండ రైతు మహా ధర్నాకు అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ అసమ్మతిని అణచివేస్తోందని ఆరోపించారు.