calender_icon.png 18 January, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ.. నీకు, నాకు ఏమన్నా భూ తగాదాలు ఉన్నాయా..?

12-09-2024 11:59:04 AM

హైదరాబాద్: ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్భంధం చేశారు. ఈ నేపథ్యంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ తో పంచాయతీ తనకు లేదని, కౌశిక్ రెడ్డితోనే తన పంచాయితీ అని గాంధీ చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. గాంధీ.. నీకు, నాకు ఏమన్నా భూతగాదాలు ఉన్నాయా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ భీఫాంపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరుతావు? అని ప్రశ్నించాడు.

కోట్లకు అమ్ముడుపోవడం, భూ పంచాయితీలో సెటిల్ మెంట్ల కోసమే కాంగ్రెస్ లో చేరారు అని ఆరోపించారు.  ప్రజాస్వామ్యంలో తన్నుకోవడం పెద్ద విషయం కాదా?, ఇద్దరం ఒకరికొకరు తన్నుకోవచ్చు.. కానీ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు కదా అన్నారు. నీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఒకరికొకరు తన్నుకోవడం సాధ్యం కాదు అన్నారు.

ఎన్నికల్లోనే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు. బీఆర్ఎస్ నే ఉంటే గాంధీ తెలంగాణ భవన్ కు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ నుంచి ఇద్దరం కేసీఆర్ వద్దకెళదాం, ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. అరెకపూడి గాంధీ మా పార్టీలో ఉన్నానని చెబుతున్నందునే ఆయన ఇంటికెళ్తాం, ఆయన్ను సాదరంగా తోలుకొని కేసీఆర్ ఇంటికి తీసుకెళ్తామన్నారు. ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి గాంధీ వస్తే ఇద్దరం కలిసి భోజనం చేస్తామన్న కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి నేరుగా కేసీఆర్ వద్దకెళ్తామన్నారు. పార్టీ నుంచి వెళ్లిన ప్రతి ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడనని చెప్పిన కౌశిక్ బీఆర్ఎస్ లోనే ఉంటే గాంధీ తెలంగాణ భవన్ కు రావాలని కోరారు.