calender_icon.png 22 February, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబాబును అడగడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వణుకు

21-02-2025 12:34:00 PM

బీఆర్ఎస్ నేతలపై మాట్లాడటం మానేసి.. కేంద్రాన్ని, చంద్రబాబును ప్రశ్నించాలి

హైదరాబాద్: నీటి విషయంలో మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై మాట్లాడటం మానేసి కేంద్రప్రభుత్వాన్ని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి మహబూబ్ నగర్ కు వలస వచ్చారని జగదీశ్ రెడ్డి సూచించారు.

మన హక్కుగా ఉన్న 123 టీఎంసీల గురించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ అవినీతి గురించి ప్రజలే మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తల దగ్గర కూడా కమిషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఏపీకి తీసుకుపోతుంటే చంద్రబాబు(AP CM Chandrababu)ను అడగడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వణుకు పుడుతుందన్నారు. ఎందుకంటే చంద్రబాబు ద్వారా పైరవీ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురు మాట్లాడట్లేడని విమర్శించారు. బీజేపీ(Bharatiya Janata Party)ని అడగడానికి దమ్ము లేదు, ఎందుకంటే మీ రేవంత్ రెడ్డి మోడీకి బీటీం అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.