calender_icon.png 15 January, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్ మాత విగ్రహం

08-12-2024 04:31:08 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్ మాత విగ్రహమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఆరోపించారు. సెక్రటేరియెట్ లో పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నమన్న జగదీష్‌రెడ్డి కావాలంటే.. మీ గాంధీ భవన్ లో పెట్టుకోవాలని సూచించారు.  దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వెనకపడిందని, కేసీఆర్ నాయకత్వంలో జిల్లాను సస్యశ్యామలం చేసుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా 3రెట్లు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతోందన్నారు. ఫ్లోరిన్ మహమ్మారిని తరిమిన ఘనత కెసీఆర్ దే అన్నారు. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి.. ఆనాడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను అడ్డుకుంట అన్ని ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు.