21-03-2025 11:01:21 AM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana Legislative Assembly Sessions) శుక్రవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) మాట్లాడుతూ.. సభలో ఏం మాట్లాడాలో చెబితే అదే మాట్లాడుతామని కోరారు. శాసనసభకు బడ్జెట్ అనేది చాలా ముఖ్యం, శాసనసభలో బడ్జెట్ ఆమోదం ముఖ్యమైన కార్యక్రమమని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహనశీలత, ఓపిక ఉండాలని హరీశ్ రావు సూచించారు. ప్రసంగం మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోకుండా చూడాలని హరీశ్ రావు( Harish Rao) స్పీకర్ ను కోరారు. భట్టి విక్రమార్క మాట్లాడిన మేరకు మా ప్రసంగం ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Telangana Finance Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టింది గట్టి బడ్జెటా? ఒట్టి బడ్జెటా? చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సమీక్షించుకోవాల్సి ఉందని తెలిపారు. రూ. 2.91 లక్షల కోట్లతో గత బడ్జెట్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అవాస్తవిక అంచనాలతో గత బడ్జెట్ పెట్టారని చెప్పానని హరీశ్ తెలిపారు. రివైజ్డ్ ఎస్టిమేట్ లో రూ. 27 వేల కోట్లు తక్కువ చేసి చూపారు. బడ్జెట్ రూ. 60 వేల కోట్ల లోటు ఉంటుందని సీఎం చెప్పారు. గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తమని తేలిపోయిందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్
ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) అన్నారు.. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ కోసం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ రూ. 31 వేల కోట్లు సమీకరించుకున్నట్లు గత బడ్జెట్ లో చెప్పారు. రూ. 20 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఎన్నికల ముందు మార్కు పేరిట వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికల తర్వాత వాగ్దానాలను ఏమార్చారు. గతంలో ఫార్మాసిటీకి భూములు సేకరిస్తే నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామన్నారు. కాంగ్రెస్ వచ్చాక వెనక్కి ఇచ్చేది పోయి మళ్లీ లాక్కుటామని చెబుతున్నారు అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఫార్మాసిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చి తిరిగి భూములు లాక్కుంటున్నారు. గతంలో నిరర్ధక ఆస్తులు అమ్మితే ఎలా విక్రయిస్తారన్నారు. ఇవాళ రూ. 30 వేల కోట్ల విలువైన భూములు అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.
రుణమాఫీలో విఫలమైనవారు మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారని గతంలో భట్టి విక్రమార్క అన్న విషయాన్ని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇవాళ చేతగానివారెవరు, మాట తప్పిందెవరు.. చిత్తశుద్ధి లేని వారెవరరు తేలిపోయిందని చమత్కరించారు. ఈ సారి బడ్జెట్ లో కౌలురైతుల ప్రస్తావనే లేదు.. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టు కూలీ పెంచినట్లు చెప్పారు. కుట్టు కూలీ రూ. 50 నుంచి రూ. 75 కు పెంచినట్లు చెప్పారని ప్రశ్నించారు. రైతుబంధు కింద ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. గత బడ్జెట్ లో పథకం కింది రైతుబంధు నిధులు ఇస్తామని చెప్పారు.
రైతులు, కౌలురైతులకు రైతుభరోసా, రైతుభీమా ఇస్తామని చెప్పారు. కౌలురైతులను రైతులే చూసుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 4.5 లక్షల ఇళ్లు కాదు కాదా.. 4 ఇళ్లు కూడా కట్టలేదని హరీశ్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలు ఇళ్లు కట్టుకుంటే రూ. 6 లక్షలు ఇస్తామని గొప్పగా చెప్పారు.. ఈ సారి ప్రసంగంలో రూ. లక్ష మాయమైంది.. దళిత, గిరిజనులను ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ఫసల్ మీమాకు రూపాయి ఇవ్వలేదు.. ఫసల్ బీమా అమలు చేయట్లేదని తెలిపారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్ అయిందన్నారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగానికి అనుమతులు బీఆర్ఎస్ హయాంలో వచ్చాయని హరీశ్ రావు స్పష్టం చేశారు.