calender_icon.png 1 November, 2024 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి మహిపాల్ రెడ్డి

15-07-2024 03:56:46 PM

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరే అవకాశం ఉంది. తను కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తన అనుచరులకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. తనతో పాటు పార్టీ మారాలని మహిపాల్ రెడ్డి తన అనుచరులకు సూచించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.