calender_icon.png 31 October, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

13-07-2024 11:47:12 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అధికారికంగా కాంగ్రెస్‌ కండువా కప్పి కాంగ్రెస్‌లో చేరారు.