కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం..
నిధులు తేవడంలో ఎంపీ బండి సంజయ్ విఫలమయ్యారు..
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ప్రణవ్ బాబు..
హుజురాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ బాబు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ పరిధిలోని గణేష్ నగర్ లో మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఒక డబుల్ బెడ్ రూమ్ కూడా అర్హులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వందల కోట్లు ఖర్చుపెట్టి డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు నిరుపయోగంగా నిలిచారన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ, నిప్పుగా ఉన్న సమయంలో కూడా కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదని వాపోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల రిపేర్ ల గురించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి పన్న ప్రభాకర్ తో సమస్యను వివరించి నిధులు తేవడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇండ్లు లేని అర్హులకి డబుల్ బెడ్ రూమ్ లతోపాటు ఇందిరమ్మ ఇల్లును అందజేస్తామన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం..
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చెయ్యి చూపారని అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వర్గానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని, రాష్ట్రం నుండి ఎన్ని మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణకు నిధులు తేవడంలో విఫలమయ్యారన్నారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా సహకరించలేదని అన్నారు. కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల గ్రామ ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఈ బడ్జెట్ లో కూడా మొండి చేయి చూపారని, ప్రజల అవసరాలు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 2009లో పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి కనపడుతుంది తప్ప ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. హుజురాబాద్ నుండి ప్రతినిత్యం వహించిన రాజేందర్ కూడా ఉప్పల్ రైల్వే పనులకు సహకరించకపోవడం అన్యాయమన్నారు.