calender_icon.png 16 January, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ కీలక సమావేశం

08-12-2024 05:14:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టేలా,  శాసనసభ, మండలి సమావేశాల కార్యాచరణపై కేసీఆర్ తమ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్‌ నేతలు వెంకట్ రాంరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, శంబిపూర్ రాజు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మధుసూదనాచారి, తదితరులు పాల్గొన్నారు.