calender_icon.png 16 January, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ అంటేనే బీ..ఆర్‌ఎస్‌ఎస్

16-01-2025 03:28:00 AM

  1. ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీతో ఆ పార్టీ ముందుకెళ్లే ప్రయత్నం 
  2. స్వాతంత్య్ర పోరాటంపై మోహన్ భగవత్ విరుద్ధ ప్రకటనలు
  3. ఆయనపై మోదీ చర్యలు తీసుకుంటారా? 
  4. 140 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఢిల్లీలో సొంత ఆఫీసు
  5. ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి):  బీఆర్‌ఎస్ అనేది బీ.. ఆర్‌ఎస్‌ఎస్ అని,  ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఆరోపణలనే తెలంగాణలో బీఆర్‌ఎస్ చేస్తోందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్య మన్నారు.  స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఏ పోరాటం చేయలేదని, వారెవరూ ఎటువంటి త్యాగాలు చేయలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్  మోహన్ భగవత్  కూడా అదే చెప్పారని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

స్వాతంత్య్ర పోరాటానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి  తెలిపారు. బీజేపీ నా యకులు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్టలని,  అందుకే తాము భారతీయ ఝూటా  పార్టీ అంటున్నామని విమర్శించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్  మో హన్ భగవత్‌తో ఉన్నారా..?  లేక  దేశ స్వా తంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా..? అని ప్రశ్నించారు. మోహన్ భగవత్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటారా..?  లేదా అనేది దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. 

దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక..

ఏఐసీసీ నూతన కార్యాలయం దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక కాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  దేశ ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని కాంగ్రెస్ నిర్మించుకుందన్నారు.  ఈ కార్యాలయం నుంచే  దేశాన్ని బలమైన, శక్తిమంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు రచిస్తుందన్నారు. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకుందన్నారు. 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 ఏళ్ల  భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. 

బీఆర్‌ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమి లేదు.. 

బీఆర్‌ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సిందేమి లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో  చట్టం తన పద్ధతిలో తాను నడిచేందుకు కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడు లు జరిగితే పోలీసులు చర్యలు చేపడ్తారని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని తెలిపారు.