calender_icon.png 25 November, 2024 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల బాధలు వినే ఓపిక సీఎంకు లేదు: కేటీఆర్

25-11-2024 01:22:28 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఇటీవల లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి అనంతరం కొంతమంది గ్రామాస్తులను పోలీసులు అరెస్టు చేసి జైల్ లో పెట్టారు. దీంతో సోమవారం లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నాను నిర్వహించింది. ఈ మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత, మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,  పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేకస్థానం ఉందని, కొత్త నియంత రేవంత్ కు మానుకోట ధర్నా బుద్ది చెప్పబోతోందన్నారు. 9 నెలలుగా కొడంగల్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తిరగబడుతున్న విషయం తెలిసిందే. లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు రైతులకు సంబంధించిన మూడు వేల ఎకరాలు గుంజుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. తమ భూములు గుంజుకోవద్దని కొడంగల్ రైతులు కోరుతున్నారని, ముఖ్యమంత్రి రైతుల బాధలు వినే ఓపిక, తీరిక లేదని అడిగారు. రేవంత్ 28 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు కానీ, 28 రూపాలయలు కూడా తేలేదని మండిపడ్డారు.

లగచర్లలో జరిగిన దాడి అధికారులపై జరిగింది కాదు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు లగచర్లకు వెళ్తే ఉరికించి కొడతారని వ్యంగ్యంగా మాట్లాడారు. లగచర్లలో దాడి జరిగితే మానకోటలో ధర్నా ఎందుకని పోలీసులు అంటున్నారని, ఎక్కడ గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఉంటారో అక్కడ బీఆర్ఎస్ ధర్నా చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఈ సీఎం ప్రజల కోసం పని చేయట్లేదు.. అదానీ, తన బంధువుల కోసమే పని చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు.. ఏడాది పూర్తవుతోంది.. అమలు చేశారా..? అని ప్రశ్నించారు.