calender_icon.png 23 September, 2024 | 4:04 AM

ప్రజాధనాన్ని బీఆర్‌ఎస్ బంధువులకు దోచిపెట్టింది

23-09-2024 02:06:36 AM

  1. కేటీఆర్ చూసిన మున్సిపల్ శాఖ పనులపై విచారణ జరపాలి
  2. టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ప్రజాధనాన్ని ప్రజలకు కాకుండా తమ బంధువులకు దోచిపెట్టిన ఘనత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా రాకపోవడంతో దిక్కుతో చని స్థితిలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

గతంలో పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేర గా, పాలమూరు  రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులు అతడికి ఇచ్చారని, ఆ వ్యవహారాలను కందాల అల్లు డు సృజన్‌రెడ్డి చూసిన మాట వాస్తవం కాదా అని సుధాకర్‌గౌడ్ నిలదీశారు. కేటీఆ ర్ బినామీల్లో సృజన్‌రెడ్డి ఒకరన్న విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం కాకముందే కేటీఆర్‌కు, సృజన్‌రెడ్డికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయన్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పను లను ఏ అనుభవం లేని సినిమా డైరెక్టర్ ఆనంద్‌సాయికి అప్పగించారని, అందులో బీఆర్‌ఎస్‌కు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ మున్షిపల్ శాఖ మం త్రిగా ఉన్న సమయంలో జరిగిన పనులపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే సమగ్ర విచారణ జరిపాలని కోరారు.