16-04-2025 02:40:55 PM
భద్రాచలం,(విజయక్రాంతి): ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్(BRS leaders ) పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జయప్రదం కోరుతూ నిధుల సమీకరణ కొరకు బుధవారం భద్రాచలం పట్టణం(Bhadrachalam town)లోని రామదాసు సామిల్లు లో కూలి పనులు చేసిన భద్రాచలం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.. వరంగల్ సభ జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ సామిల్లు యజమాని తుమ్మలపల్లి ధనేశ్వరరావు కొంత నిధిని పార్టీ కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కొల్లం జయ ప్రేమ కుమార్,అంబటికర కృష్ణ, చిట్టి మల్ల అనిల్, కొలిపాక శివ,ఎస్కే అబ్దుల్ ఖాదర్, నాగ సాయి మహిళా నాయకులు సలోమి తెల్లం రాణి తదితరులు ఉన్నారు