calender_icon.png 21 September, 2024 | 1:00 AM

9 నెలల కాంగ్రెస్ పాలనలో.. 1900 హత్యాచారాలు: హరీశ్ రావు

06-09-2024 12:03:49 PM

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఆసిఫాబాద్ ఘటన బాధితురాలిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 హత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణలో నాటు తొపాకులు రాజ్యమేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. పోలీసులను ప్రభుత్వం పనిచేయనీయట్లేదని ఆయన తెలిపారు. వరద నిర్వహణ, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.