28-03-2025 05:12:49 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాచుపల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం ప్రమాదవశత్తు కాలుజారి చెరువులో పడిన మరణించిన కిసరి రాములు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పరామర్శించి ఓదార్చారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు నర్సింలు గౌడ్, ఎండి ఆఫ్రోజ్, జి.శంకర్ టేకుర్ల సాయిలు, కురుమ గంగారం, అంజయ్య, జిలకర సాయిలు, బాలయ్య, గైనీ భూమేష్, కుంది రాములు తదితరులు పాల్గొన్నారు.