calender_icon.png 25 September, 2024 | 7:53 PM

హై డ్రామాలు కాదు... హైదరాబాద్ అభివృద్ధి కావాలి

25-09-2024 04:04:57 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైడ్రా పేరిట చేయడం కాదు, హైదరాబాదును అభివృద్ధి చేయాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నగరంలోని ఫతేనగర్, ఖాజా కుంటలో గల ఎస్టిపిలను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం కూకట్పల్లిలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కేసీఆర్ ముందుచూపుతో నగరంలో 1300 ఎం ఎల్ డి  సామర్థ్యం గల 31 ఎస్టిపిలను నిర్మించారన్నారు. భారతదేశంలో దక్షిణాసియాలో నే 100% మురుగును శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ నిలువబోతుందన్నారు. అందుకోసం 4000 కోట్లను కేటాయించారు. శాసనసభ ఎన్నికలకు ముందు తాను ఒక ఎస్టిపిను ప్రారంభించా నాని, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు ఎస్టిపిల ప్రారంభించారని చెప్పారు.

తమ హయాంలో నిమజ్జనం, మొహరం బోనాలు తదితర ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ దారి తప్పిందని విమర్శించారు. దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా బందోబస్తు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. తన పుస్తకాలు తెచ్చుకుంటానని ఏడేండ్ల పాప ఏడ్చిన, ఇంట్లో తన మందులు ఉన్నాయని ఒక గర్భిణి కోరిన హైడ్రా అధికారులు మానవత్వం చూపలేదని, వాళ్ళ ఇల్లు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా, జిహెచ్ఎంసి, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు నాలపై లేవా అని ప్రశ్నించారు. మంత్రుల ఇండ్లు ఎఫ్డిఎల్లో లేవా అన్నారు. అవకాశం ఇచ్చారని, పేదల పట్ల ఎందుకు కర్కశంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రా బాధితులకు టిఆర్ఎస్ ఎండగా ఉంటుందన్నారు. టిఆర్ఎస్ కార్యాలయానికి, ఎమ్మెల్యేల వద్దకు బాధి తులు రావాలన్నారు.

వారికి టిఆర్ఎస్, పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. ఏళ్ల తరబడి ఆక్రమణలు ఉన్నాయని, తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా వివిధ నివేదికల ద్వారా 30 వేల ఆక్రమణలు గుర్తించామని కానీ మానవంగా తమ ప్రభుత్వం వ్యవహ రించిందన్నారు. రాజకీయాలకతీతంగా పేద ప్రజలకు అండగా ఉండాలన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లోని పేదలకు ఇండ్లు ఇచ్చాక నష్ట పరిహారం చెల్లించాకే ఖాళీ చేయించాలని సూచించారు. తమ హయాంలో కట్టిన ఇండ్లనే ఇప్పుడు కాంగ్రెస్ పేదలకు ఇవ్వబోతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, మరి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, స్థానిక కార్పొరేటర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.