మేడ్చల్, (విజయక్రాంతి): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసానికి వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు శుక్రవారం యత్నించారు. శంభీపూర్ రాజు ఇంటి నుంచి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలను హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదం చేశారు. దానం నాగేందర్ ను అనుమతించి తమనెందుకు వెళ్లనివ్వట్లేదన్న నేతలు పోలీసులను ప్రశ్నించారు.
దీంతో కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజులను గృహనిర్భంధం చేసిన పోలీసులు శంభీర్ రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ విధించి భారీగా మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బీఆర్ఎస్ నేతలను కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజులను గృహనిర్భంధం చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. 20 మంది కార్యకార్తలను అదుపులోకి తీసుకున్నామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ పేర్కొన్నారు. ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సూచించారు.