15-03-2025 12:00:00 AM
చెన్నూర్, మార్చి 14 (విజయక్రాంతి) : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి సస్పెండ్ ను నిరసిస్తూ శుక్రవారం భీమారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, రేవంత్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టి ప్రెసిడెంట్ కలగూర రాజకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రశ్నించే గొంతుకను నొక్కి వేసే విధంగా సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను అబద్దాలను అడిగినందుకు అసెంబ్లీలో ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ భాగోతం తెలంగాణ ప్రజలకు అర్థమయితదని, ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందని గ్రహించి సస్పెండ్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ దంపూర్ సర్పంచ్ దాసరి మధునయ్య, మద్ధికల్ మాజి ఎంపిటిసి అత్కూరి రాము, విశాల్, సూరం లచ్చన్న, దుర్గం లాజర్, భుక్య రాజు, మనిదీపక్ దాసరి, బబ్లు, శ్రీకాంత్ గౌడ్ మహిళ నాయకురాలు కళావతి, భీమారం గ్రామ కమిటీ అద్యక్షులు ప్రణీత్ గౌడ్, నరహరి, సురేష్, గోపాల్ ముదిరాజ్ పాల్గొన్నారు.