హైదరాబాద్: కరీంనగర్ లో బీసీ కమిషన్ బహిరంగ విచారణలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా కమిషన్ ముందుకు రాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ తప్పా ఇతర పార్టీ నుంచి ఎవరూ రాలేదన్నారు. కమిషన్ మీద కాంగ్రెస్ కు నమ్మకం లేదు కాబట్టే ఎవరూ రాలేదని చెప్పారు. బీసీ కమిషన్ కు విలువ లేదని హైకోర్టు చెప్పింది.. కమిషన్ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చామన్నారు. కమిషన్ తమకు మాట్లాడడానికి సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీసీ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ లా తయారైందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని కమిషన్ ను అడిగాం.. కాంగ్రెస్, బీజేపీ బీసీ కమిషన్ ముందుకు ఎందుకు రాలేదు..?, కొత్త కమిషన్ వేయాలని కోర్టు చెప్పిన తర్వాత అభిప్రాయ సేకరణ ఎందుకు..?, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ఓట్లు దండుకుందని కౌశిక్ రెడ్డి గుర్తుచేశారు.