calender_icon.png 14 March, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నిరసన జ్వాల

14-03-2025 04:53:15 PM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు 

జిల్లా కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మ దహనం

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy)ని అసెంబ్లీ నుండి సస్పెన్షన్(Suspension) చేయడంపై బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Laxmi) ఆదేశాలతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నం జరుగుతుందని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం హేయమైన చర్య అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ లు అలీబిన్ హైమద్, సంజీవ్ కుమార్, మాజీ జడ్పిటిసి అజయ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు రవీందర్, శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు వినోద్, భీమేష్ ,తుకారం ,మాజీ ఎంపిటిసి మల్లేష్ ,నాయకులు రాజు ,ప్రవీణ్, నిసార్, రవి తదితరులు పాల్గొన్నారు.