calender_icon.png 22 February, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటిన బీఆర్ఎస్ నాయకులు

15-02-2025 02:20:06 PM

చెన్నూర్, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrashekar Rao) జన్మదినం సందర్భంగా శనివారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నామని, సోమ వారం ప్రతి ఒక్కరు మూడు మొకలు నాటాలని పిలుపునిచ్చారు.

మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌(KCR)కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జడ్పీటీసీ మోతే తిరుపతి, మాజీ కౌన్సిలర్స్ రెవెల్లి మహేష్, జగన్నాథుల శ్రీను, మాజీ సర్పంచ్ కృష్ణ, నాయకులు రామ్ లాల్ గిల్డా, నాయిని సతీష్ రాజ్, మెడ సురేష్ రెడ్డి, మాంశేట్టి శ్రీనివాస్, మెకానిక్ రవి,నెన్నెల భీమన్న, ఆశిష్, కారెంగుల శ్రావణ్, తిరుపతి, సురేష్, తగరం అశోక్ తదితరులు పాల్గొన్నారు.