ముషీరాబాద్ (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించినందున ప్రజలను చైతన్యవంతులను చేస్తూ బిఆర్ఎస్ దగ్గర అయ్యేలా తన వంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వినోద్, రాజు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.