calender_icon.png 24 September, 2024 | 3:53 PM

రైతు భరోసాకే కాదు.. సీఎం సీటుకు గ్యారంటీ లేదు : కేటీఆర్

24-09-2024 01:29:39 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రామంలో బీఆర్ఎస్ పార్టి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సబిత ఇంద్రరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇటీవల పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... త్వరాలోనే శేరిలింగంపల్లిలో ఉపఎన్నికలు జరుగుతాయని, కాళ్లు పట్టుకుని అందరిని అడిగిన వ్యక్తి ఎవరు? అని అన్నారు. ఉపఎన్నికలో ప్రజలకు కచ్చితంగా బుద్ది చెబుతారని, ఎక్కువకాలం డ్రామాలతో రాజకీయాలు సాగవు అని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పాడి 9 నెలలు గడుస్తున్న కూడా ఏ ఒక్క అవ్వకు రూ.4000 రాలేదన్నారు.

సెల్ఫీ వీడియోలతో రైతులు తమ గోడు చెప్పుకుంటున్నారని, రైతు భరోసాకే కాదు.. సీఎం సీటుకు గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని దుయ్యాబట్టారు. ఎన్నికల్లో హైదరాబాద్ లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేశామని, రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు ముట్టలేదని, కానీ పేదల ఇళ్లు, దుకాణాలన్ని కూలగొట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పేదలకు లక్ష ఇల్లు కట్టించిందని ఆయన చెప్పారు. కుంభకోణాలు చేసిందని కాంగ్రెస్ వాళ్లే అని కేటీఆర్ ఆరోపించారు.