హైదరాబాద్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించడానిక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేతలు నేరళ్ళపల్లికి బయలుదేరారు. మర్రి జనార్థన్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్ళపల్లి గ్రామంలోని ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.