calender_icon.png 18 March, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలి

18-03-2025 02:42:12 PM

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కృత్రిమ కరువు వల్ల తుంగతుర్తి ప్రాంతంలో యాసంగి వరి పొలాలు ఎండిపోవడంతో రైతులు బెంబేలు ఎత్తున్నారని, నష్టపోయిన రైతుకు ఎకరాకి రూ.25 వేల నష్టపరిహారం ప్రభుత్వమే అందించాలని కోరారు. మంగళవారం తుంగతుర్తి గ్రామంలో ఎండిన పొలాలను పరిశీలించిన బిఆర్ఎస్ శ్రేణులు మండల బృందం నిరసన తెలియచేశారు. గత మూడు రోజుల క్రితం తుంగతుర్తిలో సభకు హాజరైన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రాంత రైతుల గోస వినపడలేదని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ నెల వరకు పూర్తిస్థాయిలో ఎస్సారెస్పీ జలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగానీ రాములుగౌడ్, కేతిరెడ్డి గోపాల్ రెడ్డి దొంగరి శ్రీనివాస్, మండల నాయకులు తునికి సాయిలు, గాజుల యాదగిరి, గోపగాని రమేష్, మల్యాలా రాములు గుగులోతు రవి, కడారి దాసు,  అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, లతిబ్, విజయ్, ఆకారపు భాస్కర్ బోయిని భాస్కర్, బోయిని కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.