calender_icon.png 25 February, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లుండి ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ నేతల బృందం

25-02-2025 05:46:47 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య(Drinking Water Problem) వచ్చిందని, ప్రజలు ట్యాంకర్లతో నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పాడిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Siddipet MLA Harish Rao) పేర్కొన్నారు. గత మాజీ సీఎం కేసీఆర్ హయంలో రాష్ట్రంలో తాగు నీటి కొరత(Drinking Water Shortage) ఎప్పుడూ రాలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్(Congress Government) ప్రజలను తీవ్రనీటి సంక్షోభంలోకి నెడుతోందని వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ(SLBC) ఘటనపై ఎమ్మెల్యే  హరీశ్ రావు స్పందించారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సోరంగ మార్లంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోవడం దురదృష్టకరం, బాధకారమన్నారు.

అయితే ఈ ఘటన పర్యవేక్షించేందుకు బీఆర్ఎస్ నేతల బృందం(BRS Leaders Group) ఎల్లుండి వెళ్లాలనుందని హరీశ్ రావు వెల్లడించారు. తనతోపాటు ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లా నేతలు వెళ్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. టన్నెలో చిక్కకున్న 8 మంది ఆరోగ్యంగా తిరిగి రావాలని,  పర్యవేక్షణకు వెళ్లిన మంత్రులు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ఘటనలో వచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఘటనపై వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) బంధం వల్లే ఎన్డీఎస్ఏ ఇక్కడికి రావట్లేదని హరీశ్ రావు ఆరోపించారు.